జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా | Talcum Powder Lawsuit: Johnson & Johnson Ordered To Pay $70M After Losing Third Trial | Sakshi
Sakshi News home page

జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా

Oct 28 2016 4:01 PM | Updated on Sep 4 2017 6:35 PM

జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా

జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా

ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా పడింది.

ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా పడింది. కంపెనీకి చెందిన టాల్కం ఫౌడర్ను వాడటం వల్ల ఓ కాలిఫోర్నియా మహిళ అండాశయ క్యాన్సర్కు గురైనట్టు తేలడంతో జాన్సన్ అండ్ జాన్సన్కు సెయింట్ లూయిస్ జడ్జి ఈ జరిమానా విధించారు. ఆ మహిళకు 70 మిలియన్ డాలర్లను(రూ.467కోట్లకు పైగా) చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. మూడు గంటల వాదోపవాదాల అనంతరం వరుసగా మూడోసారి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తనను తాను నిరూపించుకోవడంలో విఫలమైంది. ఇప్పటికే ఈ కంపెనీకి వ్యతిరేకంగా 1,700 దావాలు ఫెడరల్ కోర్టుల్లో నమోదయ్యాయి. కంపెనీ ఆఫర్ చేసే చిన్న పిల్లల ఫౌండర్, షవర్-టు-షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్కు కారకాలుగా నిలుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 
 
టాల్క్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా నమోదైన మొదటి రెండు కేసుల్లో కూడా కంపెనీకి భారీ జరిమానాలే పడ్డాయి. మూడో విచారణ కూడా ఈ తరహాలోదే కావడం, కంపెనీ ఆఫర్ చేసే ఫౌడర్ అండాశయ క్యాన్సర్ బారిన పడినట్టు తేలడంతో సెయింట్ లూయిస్ మరోసారి ఈ జరిమానా విధించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాధిత మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ ఫౌండర్ను వాడుతుందని, మూడేళ్ల క్రితం ఆమె అండాశయ క్యాన్సర్ బారిన పడినట్టు గుర్తించిందని కోర్టు పేర్కొంది. సర్జరీ, రేడియేషన్, కెమియోథెరఫీ చేపించుకున్నా ఈ వ్యాధితో వచ్చే రెండేళ్లలో ఆమె మరణించే అవకాశాలు 80 శాతం ఉన్నాయని న్యాయవాదులు చెప్పారు.
 
శిక్షాత్మక నష్టాల కింద 65 మిలియన్ డాలర్లను, మెడికల్ వ్యయాల కింద 2.5 మిలియన్ డాలర్లను కంపెనీ భరించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై తాము అప్పీల్కు వెళ్తామని కంపెనీ అధికార ప్రతినిధి కరోల్ గుడ్ రిచ్ పేర్కొంటున్నారు. టాల్కం ఫౌడర్ వాడకం, అండాశయ క్యాన్సర్కు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. జాన్సన్ బేబీ ఫౌడర్ అన్ని రకాల సురక్షితమైనవంటూ కంపెనీ ఊదరగొడుతోంది. .  

Advertisement
Advertisement