జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ జరిమానా
ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ జరిమానా పడింది. కంపెనీకి చెందిన టాల్కం ఫౌడర్‌ను వాడటం వల్ల ఓ కాలిఫోర్నియా మహిళ అండాశయ క్యాన్సర్‌కు గురైనట్టు తేలడంతో జాన్సన్ అండ్ జాన్సన్‌కు సెయింట్ లూయిస్ జడ్జి ఈ జరిమానా విధించారు. ఆ మహిళకు 70 మిలియన్ డాలర్లను(రూ.467కోట్లకు పైగా) చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. మూడు గంటల వాదోపవాదాల అనంతరం వరుసగా మూడోసారి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తనను తాను నిరూపించుకోవడంలో విఫలమైంది. ఇప్పటికే ఈ కంపెనీకి వ్యతిరేకంగా 1,700 దావాలు ఫెడరల్ కోర్టుల్లో నమోదయ్యాయి. కంపెనీ ఆఫర్ చేసే చిన్న పిల్లల ఫౌండర్, షవర్-టు-షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్‌కు కారకాలుగా నిలుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
టాల్క్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా నమోదైన మొదటి రెండు కేసుల్లో కూడా కంపెనీకి భారీ జరిమానాలే పడ్డాయి. మూడో విచారణ కూడా ఈ తరహాలోదే కావడం, కంపెనీ ఆఫర్ చేసే ఫౌడర్ అండాశయ క్యాన్సర్ బారిన పడినట్టు తేలడంతో సెయింట్ లూయిస్ మరోసారి ఈ జరిమానా విధించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాధిత మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ ఫౌండర్‌ను వాడుతుందని, మూడేళ్ల క్రితం ఆమె అండాశయ క్యాన్సర్ బారిన పడినట్టు గుర్తించిందని కోర్టు పేర్కొంది. సర్జరీ, రేడియేషన్, కెమియోథెరఫీ చేపించుకున్నా ఈ వ్యాధితో వచ్చే రెండేళ్లలో ఆమె మరణించే అవకాశాలు 80 శాతం ఉన్నాయని న్యాయవాదులు చెప్పారు.
శిక్షాత్మక నష్టాల కింద 65 మిలియన్ డాలర్లను, మెడికల్ వ్యయాల కింద 2.5 మిలియన్ డాలర్లను కంపెనీ భరించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై తాము అప్పీల్‌కు వెళ్తామని కంపెనీ అధికార ప్రతినిధి కరోల్ గుడ్ రిచ్ పేర్కొంటున్నారు. టాల్కం ఫౌడర్ వాడకం, అండాశయ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. జాన్సన్ బేబీ ఫౌడర్ అన్ని రకాల సురక్షితమైనవంటూ కంపెనీ ఊదరగొడుతోంది. .