తొలిరోజే అదరగొట్టిన స్నాప్డీల్ సేల్స్ | Snapdeal Sales Volume Jump Nine-Fold On Day 1 Of Unbox Diwali Sale | Sakshi
Sakshi News home page

తొలిరోజే అదరగొట్టిన స్నాప్డీల్ సేల్స్

Oct 4 2016 8:34 AM | Updated on Sep 4 2017 4:09 PM

తొలిరోజే అదరగొట్టిన స్నాప్డీల్ సేల్స్

తొలిరోజే అదరగొట్టిన స్నాప్డీల్ సేల్స్

ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రారంభించిన 'అన్బాక్స్ దీపావళి సేల్' తొలిరోజు అదరగొట్టిందట.

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రారంభించిన 'అన్బాక్స్ దీపావళి సేల్' తొలిరోజు అదరగొట్టిందట. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ విక్రయాలు తొమ్మిది రెట్లు ఎగిశాయని స్నాప్డీల్ ప్రకటించింది. స్నాప్డీల్ ప్లాట్ఫామ్పై అమ్మకాలు నిర్వహించే 37మంది విక్రయదారుల టర్నోవర్ రూ.1 కోట్లకు పైగా క్రాస్ అయినట్టు వెల్లడించింది. కేవలం ఇదంతా తొలిరోజే నమోదుకావడం విశేషం. ప్రతిరోజు నమోదవుతున్న అమ్మకాల కంటే కనీసం తొమ్మిది రెట్లు తమ విక్రయాలు ఎగిసినట్టు స్నాప్డీల్ ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో 80 శాతం ఆర్డర్స్ మొబైల్స్ నుంచి వస్తున్నట్టు పేర్కొంది.
 
2 టైర్,3 టైర్ నగరాల్లో ముందస్తు బుకింగ్స్ దాదాపు 20 శాతం పెరిగాయని, ఇతర మెట్రోలు మిజోరాం, మేఘాలయ, గోవా, హిమాచల్ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగానే ఆర్డర్స్ వస్తున్నట్టు వెల్లడించింది. మల్టిపుల్ ఫ్యాషన్ బ్రాండ్స్లోని ఫుట్వేర్ ఉత్పత్తుల్లో ఆకర్షించే డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయని, తొలిరోజే లక్షకు పైగా ఫుట్వేర్ పేర్స్ అమ్ముడు పోయినట్టు స్నాప్డీల్ పేర్కొంది. మొబైల్ ఫోన్లలో రెడ్మి నోట్3, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 5ఎస్, మి మ్యాక్స్, లీఎకో లీ మ్యాక్స్2లు టాప్ సెల్లింగ్ ఉత్పత్తులుగా నిలిచినట్టు వెల్లడించింది. ఎయిర్ కండీషర్లు, కిచెన్ ఉపకరణాలు, ప్రెషర్ కుక్కర్స్, కెమెరాలు, ల్యాప్టాప్స్ వంటివి కూడా ఎక్కువగా విక్రయించినట్టు స్నాప్డీల్ ఆ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement