తగ్గనున్న స్మార్‌ఫోన్ ధరలు | Smart phones, cement to cost less under GST | Sakshi
Sakshi News home page

తగ్గనున్న స్మార్‌ఫోన్ ధరలు

May 23 2017 8:22 AM | Updated on Nov 6 2018 5:26 PM

తగ్గనున్న స్మార్‌ఫోన్ ధరలు - Sakshi

తగ్గనున్న స్మార్‌ఫోన్ ధరలు

జీఎస్టీ అమలుతో స్మార్ట్‌ఫోన్లు, వైద్య పరికరాలు, సిమెంట్‌ ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో స్మార్ట్‌ఫోన్లు, వైద్య పరికరాలు, సిమెంట్‌ ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లపై సగటున 13.5 శాతం పన్ను ఉండగా.. జీఎస్టీలో 12 శాతమే వసూలు చేస్తారని ఆర్థిక శాఖ తెలిపింది.

ఇక వైద్య పరికరాలపై ప్రస్తుతమున్న 13 శాతం పన్నును 12 శాతంగా నిర్ణయించారని, సిమెంట్‌పై 28 శాతం(ప్రస్తుతం 31 శాతం) జీఎస్టీ వసూలు చేస్తారని వెల్లడించింది. ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి, బయో కెమికల్‌ విధానంలో వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని 12 శాతం(ప్రస్తుతం 13 శాతం)గా నిర్ణయించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement