ఎస్‌బీఐ, ఎయిర్ ఇండియాల క్రెడిట్ కార్డ్ | SBI Card and Air India is a unique proposition | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ, ఎయిర్ ఇండియాల క్రెడిట్ కార్డ్

Sep 17 2013 2:42 AM | Updated on Sep 1 2017 10:46 PM

ఎస్‌బీఐ, ఎయిర్ ఇండియాల క్రెడిట్ కార్డ్

ఎస్‌బీఐ, ఎయిర్ ఇండియాల క్రెడిట్ కార్డ్

ఎస్‌బీఐ, ఎయిర్ ఇండియాలు కలిసి కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్‌ను అందిస్తున్నాయి.

న్యూఢిల్లీ:  ఎస్‌బీఐ, ఎయిర్ ఇండియాలు కలిసి కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్‌ను అందిస్తున్నాయి. ఎవరైనా వినియోగదారుడు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏడాదికి రూ. 5 లక్షలు ఖర్చుచేస్తే  ఢిల్లీ-ముంబై రిటర్న్ ఎయిర్ ఇండియా టికెట్‌లు మూడు పొందవచ్చు. ప్రారంభ కానుకగా 20 వేల రివార్డ్ పాయింట్లు అందిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఇక ప్రతి రూ.100 కొనుగోలుపై 4 రివార్డ్ పాయింట్లు, ఎయిర్ ఇండియా టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ప్రతి రూ.100కు 20 రివార్డ్ పాయింట్లు అందిస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి మాట్లాడారు. నగదు నిల్వల నిష్పత్తి, రెపోరేట్లను తగ్గించాలని ఆర్‌బీఐకి సూచించామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement