ఈ స్టార్‌ హీరోలను గుర్తుపట్టారా? | Salman Khan shares rare pic | Sakshi
Sakshi News home page

ఈ స్టార్‌ హీరోలను గుర్తుపట్టారా?

Jan 23 2017 12:12 PM | Updated on Sep 5 2017 1:55 AM

ఈ స్టార్‌ హీరోలను గుర్తుపట్టారా?

ఈ స్టార్‌ హీరోలను గుర్తుపట్టారా?

ఓ బాలీవుడ్‌ హీరో.. ఇంకో ఇద్దరు స్టార్లతో కలిసి దిగిన అరుదైన ఫొటోను షేర్‌ చేశాడు.

కండల వీరుడిగా పేరుపొందిన బాలీవుడ్‌ హీరో.. ఇంకో ఇద్దరు స్టార్లతో కలిసి దిగిన అరుదైన ఫొటోను షేర్‌ చేశాడు. జనవరి 25న విడుదలకానున్న 'ఆ ఇద్దరి' సినిమాలకూ బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. ఇంతకీ వీళ్లు ఎవరో గుర్తుపట్టారా?

అవును, మీ గెస్‌ కరెక్టే! 22 ఏళ్ల కిందట 'కరణ్‌ అర్జున్‌' సినిమా షూటింగ్‌ సమయంలో తీసిందీ ఫొటో! ఎడవైపు ఉన్నది 'కరణ్‌' సల్మాన్‌ ఖాన్‌. కుడివైపు ఉత్సాహంగా నిల్చున్నది 'అర్జున్‌' షారూఖ్‌ ఖాన్‌. ఇక మధ్యలో బక్కపల్చగా టక్‌ చేసుకుని కనిపిస్తున్న వ్యక్తి హృతిక్‌ రోషన్‌. రాకేశ్‌ రోషన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కరణ్‌ అర్జున్‌' విడుదలై 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సల్మాన్‌ ఈ ఫొటోను షేర్‌ చేశాడు. రాకేశ్‌ రోషన్‌కు ధన్యవాదాలు చెబుతూనే పనిలోపనిగా ఆయన కొడుకు హృతిక్‌ నటించిన 'కాబిల్' సినిమాకు, 'అర్జున్‌'షారూఖ్‌ నటించిన 'రయీస్‌' సినిమాలకు బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు.

నోట్ల రద్దు తర్వాత డీలాపడిన సినీ పరిశ్రమకు ఆమిర్‌ ఖాన్‌ 'దంగల్‌' కొత్త ఊపిరిపోయడంతో హృతిక్‌, షారూఖ్‌లు ధైర్యంగా తమతమ సినిమాలను విడుదల చేస్తున్నారు. సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహించిన 'కాబిల్‌' సినిమాలో హృతిక్‌, యామీ గౌతంలు అంధులుగా నటించారు. గుజరాత్‌ డాన్‌ అబ్దుల్‌ లతీఫ్‌ జీవితగాథ ఆధారంగా రూపొందిన 'రయీస్‌'లో షారూఖ్‌ ప్రధాన పాత్రధారి. దీనికి దర్శకుడు రాహుల్‌ ధొలాకియా. జనవరి 25న ఒకేసారి విడుదల కానున్న ఈ రెండు సినిమాలపై ట్రేడ్‌ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement