ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల నిమిత్తం వారికి కేటాయించిన మేర నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని తెలంగా ణను కృష్ణా బోర్డు ఆదేశించింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల నిమిత్తం వారికి కేటాయించిన మేర నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని తెలంగా ణను కృష్ణా బోర్డు ఆదేశించింది. గతంలో నిర్ణయిం చిన మేరకు సాగర్‌లో 502 అడుగుల వరకు లభ్యతగా ఉన్న నీటిని ఏపీకి విడుదల చేయాలని సూచించింది.
ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణకు గురువారం లేఖ రాశా రు. ప్రస్తుతం సాగర్‌లో 503.90 అడుగుల్లో నీరుం దని, 502 అడుగుల వరకు చూస్తే కనిష్టంగా 3.061 టీఎంసీల నీరుంటుందని, ఈ నీటిని విడు దల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.