మాజీ కలెక్టర్కు 14 రోజుల కస్టడీ | Ex collector kiran kumar remanded to jail custody for 14 days | Sakshi
Sakshi News home page

మాజీ కలెక్టర్కు 14 రోజుల కస్టడీ

Jul 20 2015 8:01 PM | Updated on Sep 3 2017 5:51 AM

మాజీ కలెక్టర్కు 14 రోజుల కస్టడీ

మాజీ కలెక్టర్కు 14 రోజుల కస్టడీ

పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లా మాజీ కలెక్టర్ గోడల కిరణ్కుమార్ను సిలిగురి కోర్టు 14 రోజుల జైలు కస్టడీకి పంపింది.

పశ్చిమబెంగాల్లోని మాల్డా జిల్లా మాజీ కలెక్టర్ గోడల కిరణ్కుమార్ను సిలిగురి కోర్టు 14 రోజుల జైలు కస్టడీకి పంపింది. 200 కోట్ల రూపాయల స్కాంలో ఆయన పేరు ఉండటంతో.. ఈ కేసును విచారిస్తున్న సీఐడీని కావాలంటే జైలుకు వెళ్లి విచారించుకోవచ్చని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దేవంజన్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. 2005 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన కిరణ్ కుమార్ పేరు మొత్తం 8 ఎఫ్ఐఆర్లలో ఉంది. వాటిలో నాలుగు ఫిర్యాదులను ఆయన తర్వాత ఎస్జేడీఏ సీఈవోగా పనిచేసిన శరద్ ద్వివేది దాఖలుచేశారు.
 
సిలిగురి జల్పాయిగురి డెవలప్మెంట్ అథారిటీ (ఎస్జేడీఏ) నుంచి నిధులు పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు కిరణ్ కుమార్పై వచ్చాయి. 2011 సెప్టెంబర్ నుంచి 2013 మార్చి వరకు ఎస్జేడీఏ సీఈవోగా ఉన్న కిరణ్ కుమార్ దాదాపు 80 కోట్ల రూపాయలను పక్కదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, దాదాపు 200 కోట్ల రూపాయల స్కాంలో కూడా ఆయన పేరు వినవచ్చింది.

Advertisement

పోల్

Advertisement