ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా ఓ లేఖ రాశాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా ఓ లేఖ రాశాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలుచేయాలని రెండు పార్టీలు ఈ లేఖలో కోరాయి. వెనకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి.
ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 16 నెలలు గడుస్తున్నా, హామీల అమలుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీపీఐ, సీపీఎం గుర్తుచేశాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేసే విషయంపై.. అమరావతి శంకుస్థాపన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని సీపీఐ, సీపీఎం తమ ఉమ్మడి లేఖలో కోరాయి.