మహిళా బ్యాంక్ నుంచి కొత్తగా 70 బ్రాంచీలు | Bharatiya Mahila Bank Plans 70 Branches by March | Sakshi
Sakshi News home page

మహిళా బ్యాంక్ నుంచి కొత్తగా 70 బ్రాంచీలు

Apr 12 2015 2:47 AM | Updated on Sep 3 2017 12:10 AM

మహిళా బ్యాంక్ నుంచి కొత్తగా 70 బ్రాంచీలు

మహిళా బ్యాంక్ నుంచి కొత్తగా 70 బ్రాంచీలు

భారతీయ మహిళా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా కొత్తగా 70 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బెంగళూరు: భారతీయ మహిళా బ్యాంక్  ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా కొత్తగా 70 బ్రాంచీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రస్తుతం తమకు 57 బ్రాంచ్‌లున్నాయని, గ్రామీణ ప్రాంతాలపై కూడా దృష్టిసారిస్తున్నామని భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్స్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం తమ బ్యాంక్‌కు 1.6 లక్షల వినియోగదారులున్నారని, వీరిలో 82 శాతం మంది మహిళలేనని వివరించారు. మహిళల్లో ఆర్థిక అంశాల పట్ల అవగాహనను మెరుగుపరచడం తమ బ్యాంక్ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిం చడం కోసం వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాల ద్వారా తోడ్పాటునందిస్తామని వివరించారు.
 

Advertisement

పోల్

Advertisement