
విజయకాంత్ అరెస్ట్‌కు వారెంట్
డీఎండీకే అధినేత, తమిళ సినీ నటుడు విజయకాంత్ అరెస్ట్‌కు తంజావూరు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఆర్ సేతుమాధవన్ బుధవారం వారెంట్‌ను జారీచేశారు.
డీఎండీకే అధినేత, తమిళ సినీ నటుడు విజయకాంత్ అరెస్ట్‌కు తంజావూరు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఆర్ సేతుమాధవన్ బుధవారం వారెంట్‌ను జారీచేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సమన్లకు విజయకాంత్ స్పందించకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది.
గత ఏడాది ఆగస్టు 12న బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి జయలలితలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఈ కేసులో అభియోగపత్రాన్ని పోలీసులు దాఖలు చేశారు.