వైఎస్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు | YSR plans in the lives of the poor going bright | Sakshi
Sakshi News home page

వైఎస్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు

Dec 25 2014 11:05 PM | Updated on Sep 5 2018 9:00 PM

వైఎస్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు - Sakshi

వైఎస్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నాడు అమలు ..

వైఎస్సార్ సీపీ  జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్

సంగారెడ్డి క్రైం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నాడు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో పేదల బతుకులు బాగుపడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి. ప్రభుగౌడ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలో గురువారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నాడు వైఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.

ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు అమలు చేసి పేదలను ఆదుకున్న నేత వైఎస్ అని కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ రైతులకు రుణ మాఫీ, ఉచిత కరెంట్, రుణాల రీ షెడ్యూల్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశారన్నారు. జిల్లాలో  సింగూరు జలాలు పారుతున్నాయంటే వైఎస్ కృషి ఫలితమేనన్నారు.  వైఎస్ ఆశయ సాధన కోసం యువకులు ముందుకు రావాలని, వారికి తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement