కల.. కష్టం.. సాకారం

young man get a SI posts  - Sakshi

నిరంతర కృషి, పట్టుదలతో ఎస్‌ఐలుగా ఎంపిక

పోలీస్‌ కావాలని బాల్యం నుంచే కలలుగన్నారు. కష్టపడ్డారు. ఉన్నత చదువులు చదివారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందారు. అయినా లక్ష్యం మరవలేదు. నిరంతర సాధన చేశారు. ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. పాల్వంచకు చెందిన ఇద్దరు యువకులు అకుంఠిత దీక్షతో ఇటీవల సివిల్‌ ఎస్‌ఐలుగా ఉద్యోగాలు సాధించారు.

కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది
నేనీ స్థాయికి చేరడానికి నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. ఇద్దరు అన్నలకు æ ఉద్యోగం రాలేదు. నేనైనా ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో కష్టపడ్డాను.  ఎస్‌ఐ కావడానికి అన్నయ్యలు రవికుమార్, కిషోర్, నా భార్య స్వర్ణలత  ఎంతో ప్రోత్సహించారు.  ప్రజాసేవకు  అదృష్టం దక్కడంతో సంతోషంగా ఉంది.–సాయికుమార్, సివిల్‌ ఎస్‌ఐ

గ్రంథాలయంలో చదువుకుని..
పాల్వంచ: చిన్నప్పటి నుంచి పోలీస్‌ ఉద్యోగంపై ఉన్న మక్కువతో కష్టపడ్డాడు. ‘ఎస్‌ఐ’పై గురి పెట్టాడు. కానీ ్త కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అయినా పట్టు వీడలేదు. డిపార్ట్‌మెంట్‌లో చేరిన తర్వాత ఉద్యోగానికి సెలవు పెట్టి సాధన చేశాడు. æ కోచింగ్‌ లేకుండానే గ్రంథాలయంలో చదువుకుని ఎస్‌ఐ ఉద్యోగం పొందాడు. అందరికీ  ఆదర్శంగా నిలిచాడు పాల్వంచ వనమా కాలనీకి చెందిన బొల్లేద్దు సాయి కుమార్‌. కేటీపీఎస్‌ రిటైర్డ్‌ ఉద్యోగి భిక్షం, మరియమ్మ చివరి సంతానం  బొల్లేద్దు సాయి కుమార్‌. 1నుంచి7 వరకు సిద్ధార్థ  స్కూల్, 8 నుంచి 10 వరకు కేటీపీఎస్‌ ప్రభుత్వ పాఠశాలో, ఇంటర్‌ ఏపీఎస్‌ఈబీ జూనియర్‌ కళాశాల, డిగ్రీ ప్రియదర్శిని కళాశాలలో, ఎంబీఎ కేఎస్‌ఎం కళాశాలలో పూర్తి చేశాడు. 2012లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు.  కొంతకాలం కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయంలో విధులు నిర్వర్తించాడు. అనంతరం సెలవు పెట్టి హైదరాబాద్‌ వెళ్లాడు.  గ్రంథాలయంలో దొరికే మెటీరియలే చదివాడు. 2017 ఆగస్టులో సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.

పట్టుదలే లక్ష్యం వైపు..
పాల్వంచ: బాల్యం నుంచి ఎన్నో ఒడిదొడుకుల మధ్య విద్యను అభ్యసించాడు. పట్టుదలే అతన్ని లక్ష్యం వైపు నడిపించింది. అమ్మ అందించిన ప్రోత్సాహంతో ఎస్‌ఐ కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు పాల్వంచ వెంగళరావు కాలనీకి చెందిన మహ్మద్‌ ఉఫ్‌తల్‌ రఫీ .  హకీం, ఫాతీమాలకు ఇద్దరు కుమారులు  రఫీ, అన్వర్‌.  తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. అమ్మ కేటీపీఎస్‌లో క్యాజ్‌వల్‌ లేబర్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమారులను చదివించింది. రఫీ చిన్నప్పటి నుంచి పోలీస్‌ ఉద్యోగం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. 1నుంచి 10వరకు కేటీపీఎస్‌ ప్రభుత్వ పాఠశాల, ఇంటర్‌ కృష్ణవేణి, డిగ్రీ ప్రియదర్శిని కళాశాలలో చదువుకున్నాడు. 2012లో ప్రయత్నిస్తే కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. అయినా ఎస్‌ఐ కావాలన్న పట్టుదల వీడలేదు. 2015 నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. 2017 ఆగçస్టులో సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

అమ్మ ప్రోత్సాహంతో..
చిన్నప్పటి నుంచి అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. ఆమె ప్రోత్సాహంతోనే ఎస్‌ఐగా ఎంపికయ్యాను. కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చినా  ఎస్‌ఐ కావాలన్న ఆకాంక్షే నన్ను ముందుకు నడిపింది.    డిపార్ట్‌మెంట్‌లో సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. –రఫీ, సివిల్‌ ఎస్‌ఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top