స్వర్ణభారత్ ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు స్పందించారు.
హైదరాబాద్‌సిటీ: స్వర్ణభారత్ ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు స్పందించారు. స్వర్ణ భారత్ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని, కేవలం పన్నుల నుంచి మినహాయింపు మాత్రమే ఇచ్చిందని వెంకయ్యనాయుడు అన్నారు. ట్రస్టుపై కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అవి వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
16 ఏళ్లుగా స్వర్ణభారత్ ట్రస్టు పనిచేస్తోందని, రాజకీయాలకు అతీతంగా లాభాపేక్ష లేకుండా పేదలకు, నిస్సహాయులకు సేలందిస్తోందన్నారు . స్వర్ణభారతి ట్రస్టుతో కలిసి భగవాన్ మహావీర్ ట్రస్టు జైపూర్ కృత్రిమ కాళ్లు, మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, స్వయం ఉపాధి కార్యక్రమాలతోనే స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.