ఎంపీ మురళీమోహన్ ఇంట్లో చోరీ


బంజారాహిల్స్: ప్రముఖ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కుమారుడి ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... అపోలో ఆసుపత్రి సమీపంలోని ఫిలింనగర్ సైట్-2లో మురళీమోహన్ కుమారుడు మాగంటి రాంమోహన్ నివాసం ఉంటు న్నాడు. మురళీమోహన్ కుటుంబ సన్నిహితురాలు శ్రీలంక నివాసి నాచియర్ తొండమాన్ అనే మహిళ నగరంలో తమ స్నే హితురాలి వివాహానికి హాజరయ్యేందుకు గతనెల 28న నగరానికి వచ్చి రాంమోహన్ నివాసంలో బస చేసింది.గతనెల 30న వివాహానికి హాజరై తిరిగి వచ్చాక  నగలను హ్యాండ్‌బ్యాగ్‌లో భద్రపర్చుకుంది. ఆదివారం ఉదయం శ్రీలంక తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతూ హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న నగలను సూట్‌కేస్‌లో పెట్టేందుకు చూడగా  కనిపిం చలేదు. దీంతో విషయాన్ని రాంమోహన్‌కు తెలియజేసి అంతటా వెతికింది.  అయినా కనిపించకపోవడంతో తన నగలు చోరీ అయ్యాయని ఆదివారం బంజారాహిల్స్ పోలీ సులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరి శీలించి,  క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.  చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.6 లక్షలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫి ర్యాదులో పేర్కొంది.  బంజారాహిల్స్ క్రైం ఇన్‌స్పెక్టర్  రా ంబాబు ఆధ్వర్యంలో  కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top