మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్హర్ మండలం నాగాధర పంచాయతీ పరిధిలోని గంగిచెట్టుతండా వద్ద కూలి కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఇసుక దిబ్బల కింద మృతిచెందారు.
కల్హర్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్హర్ మండలం నాగాధర పంచాయతీ పరిధిలోని గంగిచెట్టుతండా వద్ద కూలి కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఇసుక దిబ్బల కింద మృతిచెందారు.
శుక్రవారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు బాలురు వాగు వద్ద ఇసుకను తోడుతున్న క్రమంలో పై నుంచి ఇసుక దిబ్బలు కూలి వారిపై పడిపోయాయి. వాటిని తొలగించేసరికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.