నిరుపేదల ఆత్మగౌరవం డబుల్‌

TRS Government Double Bedroom Houses - Sakshi

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తోందని ఎమ్మె ల్యే  శ్రీనివాస్‌గౌడ్‌ అన్నా రు. పట్టణంలోని పాత పాలమూర్, పాతతోటకు చెందిన లబ్ధిదారులు 310 మందికి క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం గృహాలను జెడ్పీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రెండు బస్తీలకు చెందిన 310 మందికి లక్కీ డీప్‌ ద్వారా కేటాయించారు. జిల్లా కేంద్రంలోని పాత పాలమూర్, పాతతోట, వీరన్నపేటను సీఎం కేసీఆర్‌ సందర్శించిన సమయంలో 2,300 ఇళ్లను కేటాయించారు. అప్పట్లో స్వచ్ఛందంగా ఇళ్లు కూలగొట్టు కు వారికి తొలి విడతలో ఇళ్లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ సమక్షంలో లక్కీ డీప్‌ జరగగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు.

మనకే అత్యధిక గృహాలు
నిరుపేదల కోసం ప్రభుత్వం అన్ని హంగులతో డబుల్‌ బెడ్‌రూం గృ హాలు నిర్మించి ఇస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేర కు రాష్ట్రంలోనే అత్యధికంగా ఇళ్లను మంజురు చేయించుకున్న నియోజకవర్గం పాలమూరు అని అన్నారు. 523 సర్వే నెంబర్‌లో 310 ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం గృహాల నిర్మాణం, కేటాయింపు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. క్రిస్టియన్‌పల్లిలో 137 ఎకరాల్లో ఇంకా 600 ఇళ్లను నిర్మిస్తామని, వీరన్నపేటలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అయితే, ఇళ్లు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మొద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధ, హౌజింగ్‌ పీడీ రమణారావు, తహసీల్దార్‌ ప్రభాకర్, మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్, సింగ్‌విండో చైర్మన్‌ వెంకటయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్, కౌన్సిలర్లు యశోద, ప్రభాకర్, శివశంకర్‌ పాల్గొన్నారు.  

నిజాలాపూర్‌ 20 ఇళ్ల కేటాయింపు...
దేవరకద్రలోని మూసాపేట మండలంలోని నిజాలాపూర్‌ గ్రామంలో 20 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించారు. జెడ్పీ లో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సమక్షాన డ్రా తీయగా ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. నిజాలాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మరో 70 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ మాట్లాడుతూ జిల్లాను 100 శాతం ఓడీఎఫ్‌గా మార్చాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, 100 శాతం ఓడీఎఫ్‌గా మారుతున్న తమ గ్రామానికి సీఎం కేసీఆర్‌ రావాలని సర్పంచ్‌ ఇంద్రయ్యసాగర్‌ సభాముఖంగా కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top