ఖమ్మాన్ని ఎంతో అభివృద్ధి చేశా 

TRS Election Campaign In Khammam Puvvada Ajay Kumar  - Sakshi

టీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి,ఖమ్మంఅర్బన్‌: వివక్షకు గురైన ఖమ్మం నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో రూ.1,326 కోట్లు మంజూరు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందర వందనంగా తీర్చి దిద్దానని, మళ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓట్లు వేసి ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని 8వ డివిజన్‌లోని మధురానగర్, శ్రీనగర్‌కాలనీ, గొల్లగూడెం తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లను కలుసుకొని ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో కూరాకుల వలరాజు, అన్వర్‌పాషా, మీరా, తోట ప్రసాద్, మందడపు రవీంద్ర, దేశభక్తిని కిశోర్, కూరాకుల నాగభూషణం, గొల్లపూడి రాంప్రసాద్‌ పాల్గొన్నారు. 
బావోజీతండాలో టీఆర్‌ఎస్‌లో చేరికలు 
రఘునాథపాలెం: బావోజీతండాలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. వారందరికీ పార్టీ కండవాలు కప్పి సాదరంగా స్వాగతించారు. పార్టీ్టలో చేరిన వారిలో సైదులు, ధరావత్‌ నాగేశ్వరరావు, సుమన్, రాంబాబు, రవి, గుగులోత్‌ వినోద్‌కుమార్, రాజు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పవన్, శ్రీను, మంగీలాల్‌ పాల్గొన్నారు. 
ప్రజా సమస్యలను పరిష్కరించా 
ఖమ్మంమయూరిసెంటర్‌: పేదల సమస్యలను పరిష్కరించానని పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని 11, 13వ డివిజన్ల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 13వ డివిజన్‌లోని 35 కుటుంబాలు అజయ్‌కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆళ్ల నిరీషారెడ్డి, బిక్కసాని ప్రశాంతలక్ష్మి, మందడపు మనోహర్, మక్బుల్, జశ్వంత పాల్గొన్నారు.  
అజయ్‌ని గెలిపించాలి 
ఖమ్మాన్ని ఎంతో అభివృద్ధి చేసిన అజయ్‌కుమార్‌ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పువ్వాడ వసంతలక్ష్మి కోరారు. అజయ్‌ గెలుపును కాంక్షిస్తూ 23వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వసించారు. కార్యక్రమంలో పోట్ల శశికళ, కొల్లు పద్మ, మల్లిక, సుధారాణి, అన్వర్‌బీ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top