తెలంగాణ సచివాలయంలో మంత్రుల బృందం భేటీ ముగిసింది.
తెలంగాణ నామినేటెడ్ పదవుల నియామకంపై ప్రభుత్వం కసర్తు మొదలు పెట్టింది. దీని కోసం గురువారం సచివాలయంలో మంత్రుల బృందం భేటీ అయ్యింది. మూడు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సమావేశ మైన మంత్రులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు, పాలక మండళ్లపై చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయదగ్గ నామినేటెడ్ పదవుల వివరాలను అందివ్వాలని అధికారులను కోరారు. రేపటి లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ భేటీలో మంత్రులు తుమ్మల, పోచారం, కడియం లు హాజరయ్యారు.