దొరికిపోతారు

Telangana Police Special Mobile App Citizen Tracking For COVID 19 - Sakshi

సంగారెడ్డి: వాహనదారులు అనవసర కారణాలు చెప్పి రోడ్లపైకి వస్తున్నారని, నిర్దేశించిన మూడు కిలోమీటర్ల పరిధి దాటి తిరుగున్నారని తెలంగాణ పోలీస్‌ ‘సిటిజెన్‌ ట్రాకింగ్‌ యాప్‌ ఫర్‌ కోవిడ్‌–19’ అనే అప్లికేషన్‌ను రూపొందించింది. బయట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తి వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్, మొబైల్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌ వంటివి ఆ యాప్‌లో నమోదు చేస్తారు. ప్రతి చెకింగ్‌ సెంటర్‌లో ఇలా నమోదు చేయటం వల్ల ఆ వ్యక్తి ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే విషయం తెలిసిపోతుంది. నిబంధనలు అతిక్రమిస్తే సులువుగా దొరికిపోతారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేస్తారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఆర్డీవో మెంచు నగేష్, డీఎస్పీ శ్రీధర్‌ రెడ్డిలు వాహనదారుడి వివరాలు నమోదు చేస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌ మనిపించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top