
మత, ప్రాంతీయ భావాలతో కాంగ్రెస్ వ్యవహరించలేదు: పొన్నాల
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఎన్నడూ మత, ప్రాంతీయ భావాలతో వ్యవహరించలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఎన్నడూ మత, ప్రాంతీయ భావాలతో వ్యవహరించలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన సంద ర్భంగా ‘తెలంగాణ డిక్లరేషన్’ కార్యక్రమాన్ని మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. తెలంగాణ తల్లి పేర ప్రత్యేకంగా తయారు చేసిన జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రోజని పేర్కొన్నారు. ఇచ్చిన మా టకు క ట్టుబడి సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారన్నారు.
బంగారుతెలంగాణకు పునాది వేసింది కాంగ్రెసే
బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాదులు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఉన్నాయన్న విషయాన్ని మచిరిచిపోరాదన్నారు. జెండా ఆవిష్కరణతోపాటు గాంధీభవన్‌లో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా 1969 ఉద్య మ యోధులకు సన్మానం చేశారు. కిసాన్‌సెల్ ఆధ్వర్యంలో రైతుల సదస్సు జరిగింది. రుణమాఫీ అంశంపై రైతులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ ఖర్చులతో కొందరు రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. అంతకు ముందు, పొన్నాల లక్ష్మయ్య గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిం చారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.