వచ్చే ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్ధిక మంత్రి ఈటెల తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
విద్యుత్ రంగానికి రూ.3241 కోట్లు: ఈటెల
Nov 5 2014 12:06 PM | Updated on Aug 15 2018 9:22 PM
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్ధిక మంత్రి ఈటెల తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఎన్టీపీసీ ద్వారా అదనంగా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్ కోలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టామని అన్నారు.
రైతులకు సోలార్ పంపు సెట్లు కోసం 200 కోట్లు బడ్జెట్ లో కేటాయించినట్టు ఆయన తెలిపారు. విద్యుత్ రంగానికి మొత్తం 3241 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. 50 ఏళ్లుగా తెలంగాణపై చేసిన పరోక్ష పెత్తనం కారణంగానే ఈప్రాంతం వెనుకబడేలా చేసిందని ఆయన అన్నారు.
Advertisement
Advertisement