తెలంగాణలో భూములను రీ సర్వేచేసి, అన్ని స్థాయిల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అమలుచేసేందుకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటూ రాష్ర్ట రెవెన్యూశాఖ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది.
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూములను రీ సర్వేచేసి, అన్ని స్థాయిల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అమలుచేసేందుకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటూ రాష్ర్ట రెవెన్యూశాఖ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణలో భూముల సర్వే నిజాం కాలంలో, 80 ఏళ్ల క్రితం జరిగిందని, భూముల రికార్డులు కూడా అప్పుడే తయారయ్యాయని, అందులో వివరాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ ఇటీవల కేంద్రానికి పంపిన లేఖలో వివరించారు.