
పోరాటమే శరణ్యం
తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
తుంగతుర్తి: తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి, అన్నారంలలో ఏర్పాటు చేసిన సభల్లో తమ్మినేని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
కాగా ఎస్సారెస్పీ రెండోదశకు నీరు అందించేందుకు దేవాదుల నుంచి నీటిని కాలువల్లోకి తరలించాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ స్టేజ్ కోసం గతంలో తవ్విన కాలువల్లో చెట్లు మొలిచాయన్నారు.