సుందర్‌రాజ్‌కు రూ.5లక్షల నగదు బహుమతి | Sundarraj Rs 5 lakh cash prize | Sakshi
Sakshi News home page

సుందర్‌రాజ్‌కు రూ.5లక్షల నగదు బహుమతి

Apr 15 2016 2:21 AM | Updated on Aug 17 2018 8:11 PM

సుందర్‌రాజ్‌కు రూ.5లక్షల నగదు బహుమతి - Sakshi

సుందర్‌రాజ్‌కు రూ.5లక్షల నగదు బహుమతి

అంతర్జాతీయ స్థాయి యోగాలో పతకాలు సాధించిన యోగా క్రీడాకారుడు సుందర్‌రాజ్‌కు అరుదైన గౌరవం ....

మహబూబ్‌నగర్ క్రీడలు : అంతర్జాతీయ స్థాయి యోగాలో పతకాలు సాధించిన యోగా క్రీడాకారుడు సుందర్‌రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. పేదింటి సుందర్‌రాజ్‌ను గురువారం హైదరాబాద్ నెక్లస్‌రోడ్డులో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ రూ.5లక్షల నగదు పారితోషికం అందజేశారు.

సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి రామలక్ష్మయ్య మాట్లాడుతూ గురుకులంలో చదువుతున్న సుందర్‌రాజ్‌కు సీఎం రూ.5లక్షల చెక్కు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ప్రతినిధులు పుల్లయ్యయాదవ్, లక్ష్మయ్య, క్రీడల అధికారి సోమేష్ సీఎం కేసీఆర్, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement