
సోనియా వ్యాఖ్యలు అర్ధరహితం
రాజ్యసభలో తెలంగాణ బిల్లును బీజేపీ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని కరీంనగర్ సభలో సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు.
బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు
బోయినపల్లి, న్యూస్‌లైన్: రాజ్యసభలో తెలంగాణ బిల్లును బీజేపీ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని కరీంనగర్ సభలో సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఈర్ష్యతో సోనియా అసత్యపు ఆరోపణ లు చేశారని ఆరోపించారు. దేశంలో మోడీ హవా నడుస్తోందని, దేశాభివృద్ధి, సుపరిపాలన కోసం బీజేపీని గెలిపించాలన్నారు.