బుస్ స్ స్ స్............. | snakes attack in a house | Sakshi
Sakshi News home page

బుస్ స్ స్ స్.............

Apr 2 2015 9:04 PM | Updated on Oct 22 2018 2:22 PM

బుస్ స్ స్ స్............. - Sakshi

బుస్ స్ స్ స్.............

మెదక్ జిల్లా హత్నూర మండలం సాదుల్లనగర్‌లో గురువారం పాములు కలకలం రేపాయి.

మెదక్: మెదక్ జిల్లా హత్నూర మండలం సాదుల్లనగర్‌లో గురువారం పాములు కలకలం రేపాయి. వివరాలిలా ఉన్నాయి.. సాదుల్లనగర్‌కు చెందిన మాచునూరి కృష్ణ ఇంటి గడప సమీపంలో నుంచి ఉదయం రెండు పాములు లోపలికి రావడంతో వెంటనే వాటిని చంపేశారు. మధ్యాహ్నం తర్వాత మరికొన్ని పాము పిల్లలు ఇంట్లోకి రావడంతో వాటినీ చంపేశారు. అయితే రాత్రి కూడా.. గడపకు సమీపంలోని రంధ్రం నుంచి మరిన్ని పాములు వస్తుండటంతో అక్కడ తవ్వి చూడగా పెద్ద ఎత్తున పాము పిల్లలు బయటపడ్డాయి. అక్కడ మొత్తం 56 పాములను చంపినట్లు గ్రామస్తులు తెలిపారు.
(హత్నూర)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement