నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలోని పురాతన శివాలయంలో చోరీ జరిగింది.
పురాతన శివాలయంలో విగ్రహాల చోరీ
Mar 16 2016 1:49 PM | Updated on Aug 30 2018 5:27 PM
రామన్నపేట: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలోని పురాతన శివాలయంలో చోరీ జరిగింది. భవానీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గర్భాలయంలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయారు. గ్రామ సర్పంచ్ బత్తుల శంకరయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి.శీనయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది.
Advertisement
Advertisement