'భూ సేకరణను వేగవంతం చేయండి' | Review meeting of Palamur-Rangareddy Project | Sakshi
Sakshi News home page

'భూ సేకరణను వేగవంతం చేయండి'

Jul 31 2015 4:00 PM | Updated on Mar 22 2019 3:19 PM

'భూ సేకరణను వేగవంతం చేయండి' - Sakshi

'భూ సేకరణను వేగవంతం చేయండి'

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను కోరారు.

హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని మంత్రులు అధికారులను కోరారు. శుక్రవారం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి జోషి, ఆర్ అండ్ ఆర్ కమీషనర్ మాణిక్‌రాజ్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో భూ సేకరణకు సంబంధించిన అంశంపై చర్చించారు. భూసేకరణకు ఉన్న అడ్డుంకులను తొలగించి, భూ సేకరణను వేగవంతం చేయాలని అధికారలకు సూచించారు. ప్రక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని నిర్దేశించారు. ఇదే అంశంపై సోమవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement