బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
మహబూబ్‌నగర్: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వివరాలివీ... ఆత్మకూర్ మండలం రేచింతల గ్రామానికి చెందిన ఓ బాలిక(16) గత నెల 28న రాత్రి 7గంటల సమయంలో గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు వైద్యం కోసం వెళ్లింది. తిరిగి వస్తున్న ఆమెను అక్కడే మాటు వేసిన కురుమన్న(22), ఆంజనేయులు(19) బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై బాధితురాలు గత నెల 31వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం వారిద్దరూ గ్రామ సమీపంలో ఉన్నట్లు తెలియడంతో వలపన్ని పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఆత్మకూర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
(ఆత్మకూర్)