అధికారుల తీరు మారకుంటే.. నేనేంటో చూపిస్తా ! | Politics in Electrical Material | Sakshi
Sakshi News home page

అధికారుల తీరు మారకుంటే.. నేనేంటో చూపిస్తా !

Jun 10 2015 12:53 AM | Updated on Oct 29 2018 8:31 PM

విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై మాజీమంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సమస్యలు

 విద్యుత్ మెటీరియల్ కేటాయింపులో రాజకీయాలు చేస్తున్నారు
 లోఓల్టేజీ సమస్యను సత్వరమే పరిష్కరించాలి
 లేదంటే 15రోజుల్లో
 50 వేలమందితో ధర్నా
 విద్యుత్ అధికారుల సమీక్షలో
 ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఫైర్
 
 నల్లగొండ : విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై మాజీమంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు రా జకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం నల్లగొండలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ భిక్షపతి, ఏడీఈ, ఏఈలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఈలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలు పక్కన పెట్టి విద్యుత్ మెటీరియల్ కేటాయింపులో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరులో మార్పురాని లేదంటే పక్షంలో తానెంటో ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న విద్యుత్ పనులను వెంటనే పూర్తిచేసి ప్రజలు ఎదుర్కొంటున్న లోఓల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
 
 కనగల్, తిప్పర్తి మండలాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. పదిహేను రోజుల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించని పక్షంలో 50 వేల మందితో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ సమావేశం అనంతరం ఆర్డీఓ వెంకటాచారితో సమావేశమై సందనపల్లి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై చర్చించి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రామిరెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ పాశం సంపత్‌రెడ్డి, పార్టీ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, తుమ్మల లింగస్వామి, కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, నాగరత్నం రాజు, అశోక్ సుందర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement