'ఎమ్మెల్యేలు బలవంతంగా మాపార్టీలోకి రాలేదు'
ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీలోకి బలవంతంగా రాలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీలోకి బలవంతంగా రాలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నీచపు పనులన్నీ కనిపిస్తున్నాయన్నారు. తమ పార్టీలోకి ఏ ఎమ్మెల్యే కూడా బలవంతంగా రాలేదని ఈ సందర్భంగా పోచారం తెలిపారు.
చంద్రబాబుకు నైతికత ఉంటే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు.


