కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తుండ్రు | People getting KCR fraud | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తుండ్రు

Aug 18 2015 4:08 AM | Updated on Jul 25 2018 2:52 PM

కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తుండ్రు - Sakshi

కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తుండ్రు

ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత మాటలను ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని డీసీసీ ప్రసిడెంట్ బూడిద భిక్షమయ్యగౌడ్ హెచ్చరించారు...

- ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు
- డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్
రాజాపేట :
ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత మాటలను ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో  పరాభవం తప్పదని డీసీసీ ప్రసిడెంట్ బూడిద భిక్షమయ్యగౌడ్ హెచ్చరించారు. సోమవారం రాజాపేటలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి  సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌పార్టీ.. ప్రజా సంక్షేమం కోసం అనే సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ రాష్ర్టం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు.  ప్రజాక్షేత్రంలోనే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతలా వ్యహరిస్తుందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా స్పందించడం లేదని దుయ్యబట్టారు.   

మనఊరు-మనప్రణాళిక, మిషన్ కాకతీయ, నేడు గ్రామజ్యోతి పథకాలతో ప్రజలకు ఒరిగేదీమీ లేదన్నారు. మద్యం నూతన పాలసీ విధానం తీసుకురావడం దారుణమన్నారు. కేసీఆర్ పాలన బ్రిటిష్ హయాం మించిందని.. ఇకముందు ప్రజలపై జట్టుపన్ను కూడా వసూలు చేస్తాడేమోనని ఎద్దేవా చేశారు.  ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ యాదగిరిగుట్ల మండల పార్టీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, యువజన విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, నాయకులు సట్టు తిరుమలేష్, నెమిల మహేందర్‌గౌడ్, అర్కాల గాల్‌రెడ్డి, పాండవుల రాములు, నాగిర్తి జ నార్దన్‌రెడ్డి, శీలం రవిందర్‌రెడ్డి, రాజు, బాలయ్య, సురేం దర్, జనార్ధన్, సర్పంచ్‌లు కృష్ణ, ఎంపీటీసీలు ఎండీ అసీనొద్ధీన్, వీరస్వామి, భాగ్యమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement