వడదెబ్బతో వివిధ చోట్ల తొమ్మిది మంది మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నందిగామకు చెందిన వ్యవసాయ కూలీ
సాక్షి, నెట్‌వర్క్: వడదెబ్బతో వివిధ చోట్ల తొమ్మిది మంది మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నందిగామకు చెందిన వ్యవసాయ కూలీ సీతారామ్(45) సోమవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు పత్తి కర్ర ఏరివేసి తగులబెట్టి వచ్చాడు. వడదెబ్బతో ఇంటికి వచ్చి రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయం చూసేసరికి చనిపోయూడు. ఇదే గ్రామానికి చెందిన రైతు దేవ్‌రావ్(50) సోమవారం తన పొలంలో పనులు చేశాడు. సాయంత్రం నీరసంగా ఉందంటూ పడుకున్నాడు. మంగళవారం ఉదయం నిద్రలేచాక ఇంటికి దగ్గర్లోని సీతారామ్ వడదెబ్బతో చనిపోయూడని తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లి వచ్చాడు.
అనంతరం సొమ్మసిల్లి పడిపోయూడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి చనిపోయూడు. నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్‌కు చెందిన కూలి గ న్నేరి శివశంకర్(65) మంగళవారం వడదెబ్బతో మృతిచెందాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరవునిపల్లికి చెందిన కనకబండి నర్సయ్య(80), బూర్గంపాడు మండలం మోతీపట్టీనగర్‌కు చెందిన దండగుల గురమ్మ(45), ఖమ్మం రూరల్ మండలం బారగూడేనికి చెందిన ఎన్నబోరుున అనంతమ్మ(72), చర్ల మండలం కుదునూరుకు చెందిన బట్టా గంగయ్య(78), రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం బొమ్మరాశిపేట్ ఔటర్ రింగురోడ్డు డివైడర్ వద్ద ఓ వ్యక్తి(65), వరంగల్ జిల్లా హన్మకొండ మండలం తిమ్మాపురానికి చెంది న కూలీ పణికర వెంకటయ్య(45) ఎండదెబ్బ తగలడంతో సొమ్మసిల్లి మృతి చెందారు.