‘స్మార్ట్‌’గా చదివేద్దాం | Mobile Apps For Students | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’గా చదివేద్దాం

Feb 4 2019 11:14 AM | Updated on Feb 4 2019 11:14 AM

Mobile Apps For Students - Sakshi

హిమాయత్‌నగర్‌ :స్మార్ట్‌ఫోన్‌.. దీనిపై కొంచెం అవగాహన, మరికొంచెం ఆసక్తి ఉంటే చాలు ప్రపంచం మీ ముందున్నట్లే. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తోడుగా నిత్య నూతన విషయాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలే తెలుసు.. కానీ నిత్య జీవితంలో, చదువులో ఉపయోగపడే యాప్‌లు కూడా ప్రస్తుతం బోలెడు లభ్యమవుతున్నాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు సమస్యలకు సులువుగా పరిష్కారాలు లభిస్తాయి. మార్కెటింగ్, వ్యాపారం, చదువు, ఇలా అనేక రంగాలకు సంబంధించిన యాప్‌లు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావడంతో ఆయా రంగాల్లోని ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సహాయకారిగా ఉండే యాప్‌లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. గణితంలో చతుర్విధ ప్రక్రియలు, పరిసరాల పరిజ్ఞానం నుంచి ఇంజినీరింగ్‌ స్థాయి వరకు, కెమిస్ట్రీ ఈక్వేషన్ల నుంచి అనాటమీ వరకు అనేక యాప్‌లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విద్యారంగానికి సంబంధించిన గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే మంచి రేటింగ్‌ ఉన్న యాప్స్‌ సమాచారం మీ కోసం.    

సైంటిఫిక్‌ కాలిక్యులేటర్‌
ఇంటర్‌ ఎంపీసీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ యాప్‌ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సాధారణ కాలిక్యులేటర్‌లో చేయలేని ఎన్నో క్లిష్టమైన లెక్కలను దీంతో చేసుకోవచ్చు. గుర్తించడానికి కష్టతరమైన గణిత ఫార్ములాలతో పాటు ప్రోగ్రామింగ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉండడం ఈ యాప్‌ ప్రత్యేకత. ప్రోగ్రాం స్క్రిప్ట్‌ చేసుకుని కావాల్సినప్పుడు చూసుకునే అవకాశం ఉంటుంది.

 మై హోంవర్క్‌ స్టూడెంట్‌ ప్లానర్‌
ఈ యాప్‌ ఉంటే హోమ్‌ వర్క్‌ గురించి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మర్చిపోయిన విషయాల్ని సైతం రిమైండర్‌ రూపంలో ఎప్పటికప్పుడు గుర్తించేలా చేస్తుందీ యాప్‌. స్కూల్‌ లేదా కాలేజీ తరగతి టైమ్‌ టేబుల్, పరీక్షల తేదీలు, మార్కులు, ప్రాజెక్టులు తదితర వివరాలు ఈ యాప్‌లో దాచుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది ఒక డిజిటల్‌ ప్లానర్‌గా ఉపయోగపడుతుంది.

యూనిట్‌ కన్వర్టర్‌
ఈ యాప్‌ సహాయంతో దూరం, బరువు, ఉష్ణోగ్రత, స్థలం చుట్టుకొలత, వేగం, కాలం తదితర గణాంకాలను తేలికగా కన్వర్ట్‌ చేయవచ్చు. ఒక హెక్టారుకు ఎన్ని గజాలు, ఎకరాలు తెలుసుకోవడం చాలా తేలిక. డిగ్రీలను సెల్సియస్, ఫారన్‌హీట్, కెల్లిన్‌లోకి మార్చుకోవడం, టన్నులను గ్రాములు, మిల్లీగ్రాములు, కిల్చోగ్రాములు వంటి వాటిని సులభంగా చేయవచ్చు.

మూలకాల పట్టిక
ఈ యాప్‌ ఉంటే హోమ్‌ వర్క్‌ గురించి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మర్చిపోయిన విషయాల్ని సైతం రిమైండర్‌ రూపంలో ఎప్పటికప్పుడు గుర్తించేలా చేస్తుందీ యాప్‌. స్కూల్‌ లేదా కాలేజీ తరగతి టైమ్‌ టేబుల్, పరీక్షల తేదీలు, మార్కులు, ప్రాజెక్టులు తదితర వివరాలు ఈ యాప్‌లో దాచుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది ఒక డిజిటల్‌ ప్లానర్‌గా ఉపయోగపడుతుంది.

అనాటమీ లెర్నింగ్‌(త్రీడీ)
మానవ శరీరానికి సంబంధించిన అవయవాల తీరుని తెలుసుకునేందుకు ఉపయోగపడే యాప్‌ అనాటమీ లెర్నింగ్‌. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, వివిధ నాడుల పనితీరు, అమరిక తదితర అంశాల్ని త్రీడీ రూపంలో వీక్షిస్తూ తెలుసుకోవచ్చు. ఇందులో స్త్రీ, పురుషుల శరీర భాగాలకు సంబంధించి విడివిడిగా అధ్యయనం చేసుకునేందుకు వీలవుతుంది. మెడిసిన్‌ విద్యార్థులకు ఈ యాప్‌ ఉపయుక్తంగా ఉంటుంది.

యాప్స్‌ ఎంతో ఉపయోగకరం
ఆన్‌లైన్‌లో ఉన్న ఈ యాప్స్‌ ఎంతో ఉపయోగకరం. ఏదైనా సబ్జెక్ట్‌లో సందేహం ఉంటే స్మార్ట్‌ ఫోన్‌ ఆధారంగా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మేం కూడా విద్యార్థులకు ఈ యాప్స్‌ వల్ల ఉన్న ప్రయోజనాలను వివరిస్తున్నాం. నిజంగా ఇటువంటి యాప్స్‌ వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రయోజనం పొందడం అభినందనీయం. – వి.ఉమామహేశ్వరి, ప్రిన్సిపాల్, జ్యోతివిద్యాలయ హైస్కూల్, బీహెచ్‌ఈఎల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement