ఏంది ఈ రోడ్డు ? ఎలా వెళ్లేది ! | Minister Prashanth Reddy Fires On Sarpanch About Road Condition | Sakshi
Sakshi News home page

ఏంది ఈ రోడ్డు ? ఎలా వెళ్లేది !

Sep 26 2019 9:33 AM | Updated on Sep 26 2019 9:33 AM

Minister Prashanth Reddy Fires On Sarpanch About Road Condition - Sakshi

సాక్షి, భీమ్‌గల్‌(నిజామాబాద్‌) : మండలంలోని సంతోష్‌నగర్‌ తండాలో నీటి లీకేజీ కారణంగా ప్రధాన రహదారి దెబ్బ తినడంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన కలెక్టర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి కారులో బయల్దేరారు. అయితే, తండా వద్దకు రాగానే రోడ్డంతా దెబ్బతిని బురదమయం కావడాన్ని గమనించిన మంత్రి.. వాహనాన్ని ఆపి కిందికి దిగారు. రోడ్డు ఇలా కావడంపై సర్పంచ్‌ ఎంజీ నాయక్‌ను ప్రశ్నించారు. పక్కనే ఉన్న భగీరథ పైపులైన్‌ లీకేజీ కారణంగా నీరు రోడ్డుపై ప్రవహించి బురదమయంగా మరుతోందని సర్పంచ్‌ తెలిపారు. దీంతో ఆయన అక్కడి నుంచే ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే రోడ్డును సరిచేయాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement