
సాక్షి, హైదరాబాద్: కలిసికట్టుగా కరోనా వైరస్‌ను ఎదుర్కొందామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కోఠి కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.
అధునాతన భవనం నిర్మించాలి..
ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చి అధునాతన భవనం నిర్మించాలని తెలంగాణ మోస్ట్ బ్యాక్ వర్డ్ సంక్షేమ సంఘం(టీఎంబీసీ) ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు. పేదల ప్రాణాలు కాపాడలేని చారిత్రాత్మక కట్టడాలు అవసరం లేదని ఆ సంఘ అధ్యక్షులు ఆరేకటిక సుధాకర్ తెలిపారు. హైదరాబాద్‌కే గర్వకారణం అయ్యేలా అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని మంత్రిని కోరారు.