ఈత.. కడుపుకోత

Many Children Die Because There Is No Proper Understanding Of Swimming - Sakshi

వేసవిలో సర దాలు.. విద్యార్థులకు   గండాలు

అవగాహన లేక  ప్రాణాలు కోల్పోతున్న వైనం

తల్లిదండ్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

వేసవికాలం.. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలన్నా.. స్నేహితులతో సరదాగా గడపాలన్నా ఈత ఒకటే మార్గం.. ఈ నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు, పెద్దవారు సైతం బావులు, కాల్వలు, చెరువుల్లో సేదతీరుతూ కనిపిస్తుంటారు.. అయితే కొంత మంది ఈత రాకపోయినా.. ఎలా కొట్టాలో తెలియకపోయినా ఈ తపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ప్రతియేటా పదుల సంఖ్యలో ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు.. ఈ క్రమంలో ఇ టు తల్లిదండ్రులు గాని.. అటు ప్రభుత్వ యంత్రాంగం గాని వీరిపై ప్రత్యేక దృష్టిసారించలేకపోతున్నారు.. ఫలితంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చుతున్నారు..

మహబూబ్‌నగర్‌ క్రైం : వేసవి సెలవుల్లో పిల్లలు.. పెద్దలు ఈత నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మండు వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి.. సెలవుల సరదాతో కాలక్షేపం కోసం ఈతకు వెళ్లడం అందరికీ అభిరుచిగా మారుతోంది. అలాంటిది ఈత రాక ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కనీసం అవసరమైన స్విమ్మింగ్‌ పూల్స్‌ లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది. భౌగోళికంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, నదులు, బావులు, కాల్వలకు కొదువ లేదు. జిల్లాకేంద్రంతో పాటు ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈత సరదాను తీర్చుకునేందుకు బావులకు వెళ్తుంటా రు. పట్టణంలో కంటే గ్రామీణ ప్రాంతా ల్లోని విద్యార్థులు, యువకులు ఆయా ప్రాంతాల్లో ఉండే బావులు, కుం టలు, చెరువులు, కాల్వలను  అధికంగా ఆశ్రయిస్తున్నారు. చాలామందికి ఈత కొట్టడం ఎలాగో తెలియక ప్రమాదాల ను కొని తెచ్చుకుంటున్నారు. రక్షణ చర్యల్లేక ఈత మాటున నిండు ప్రాణాలను పోగొట్టుకుని కన్నవారికి కడుపుకో త మిగులుస్తున్నారు. వేసవిలో బాలలు, యువకులు జిల్లాలో ఈతకు వెళ్తూ నీటిలో మునిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఏటా పెరుగుతున్నాయి. నీటిలోతు, ఈత కొట్టే పద్ధతులు తెలియక అందులో మునిగిపోతుండగా రక్షణ చర్యలు కరువయ్యాయి.  

రక్షించడం ఇలా..
ప్రత్యక్ష పద్ధతి ద్వారా నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే వీలుంటుంది. అయితే రక్షించబోయే వ్యక్తికి ఈత రావడంతోపాటు ధైర్యం కలిగి ఉండాలి. నీటిలో మునుగుతున్న వ్యక్తి వెనుక నుంచి వెళ్లి అతని వెంట్రుకలు, అండర్‌వేర్, మొలతాడు వంటి వాటిలో ఏదో ఒకటి పట్టుకొని ఒడ్డుకు తీసుకురావాలి.  

పరోక్ష పద్ధతి..

ఈ పద్దతి ద్వారా ఈత వచ్చిన వారితోపాటు రాని వారు కూడా నీటిలో మునుగుతున్న వారిని రక్షించవచ్చు. రక్షించే వారు నీటిలోకి దిగకుండా ఒడ్డున ఉండే ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఆసరాగా ఒడ్డునుంచే దేన్నైనా పట్టుకునేలా అందించాలి. దగ్గరగా ఉంటే కర్ర, టవల్, ప్యాంట్‌ వంటివి అందించాలి. దూరంగా ఉంటే తాడు, పొడవాటి కర్రను అందించి ఒడ్డుకు చేర్చాలి. నీటిపై తేలియాడే పరికరాలను నీటిలోకి విసిరి వేయాలి.  

ప్రథమ చికిత్స ముఖ్యం..
నీటిలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఒడ్డుకు చేర్చగానే అతన్ని వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊదుతూ కృత్రిమ శ్వాస అందించాలి. ఛాతిపై చేతులతో ఒత్తాలి. దీంతో శ్వాస పెరుగుతుంది. ప్రథమ చికిత్స చేస్తూనే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలి.

జాగ్రత్తలు అవసరం..

  • ఈత కొలనులోకి నేర్చుకునేందుకు వెళ్తున్నప్పుడు అక్కడ సుశిక్షితులైన కోచ్‌లు, ఇతర సిబ్బంది రక్షణ చర్యలు ఉన్నాయో లేదో చర్యలు ఉన్నాయో లేదో పెద్దలు పరిశీలించాల్సిన తర్వాతే పిల్లలను పంపించాలి.
  • చెరువులు, కాల్వల్లో, ఈతకు వెళ్తున్నప్పుడు బాలల వెంట పెద్దవారు తప్పక వెళ్లాలి.
  • కొత్త ప్రదేశంలో బావులు, కాల్వలు, చెరువుల్లో ఈత కొట్టే ముందు కర్ర సాయంతో లోతును పరిశీలించాలి. ఈత రాని వారు దాన్ని నేర్చుకునేందుకు ట్యూబ్‌లు, ఇతర పరికరాలను ఉపయోగించి పూర్తిగా ఈత కొట్టడం వచ్చాకే లోతుకు వెళ్లాలి.
  • సెలవులు కాబట్టి పిల్లలు బయటికి వెళ్లి చాలా సమయం అయితే వారి వారి తల్లిదండ్రులు పిల్లల సమాచారంపై వాకబు చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
  • విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు స్నానం ఆచరించాలే తప్ప అక్కడి వాటిల్లోకి వెళ్లి ఈత కొట్టడం చేయవద్దు.
  • మట్టిని లోతుగా తవ్విన ప్రాంతాల్లో నిలిచిన నీటిలో లోతు తెలియదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఈతకు సాహసం చేయరాదు.
  • జిల్లాలో కృష్ణ, జూరాల, కోయిల్‌సాగర్, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు గడపడానికి వచ్చిన పిల్లలు ఈతకు వెళ్లినప్పుడు వారి వెంట పెద్దవారు తప్పకుండా ఉండాలి.  

ఇవీ ప్రమాద ఘటనలు..

  • కందూరు రామలింగేశ్వర ఆలయ కోనేరులో ఈ నెల 8న ఈత రాక నీటలో మునిగి మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని ఏనుగొండకు చెందిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు అనే అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు.
  • ఈ నెల 15న గద్వాల మండలం జమ్మిచేడ్‌కు చెందిన జశ్వంత్‌ బావిలో నీట మునిగి మృతిచెందాడు.
  • ఈ నెల 18న ధన్వాడ ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న నరేష్‌కుమార్‌ బావిలో గల్లంతు అయితే మరసటి రోజు ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top