అధికారులకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే | Mallanna Sagar Case In TS High Court | Sakshi
Sakshi News home page

అధికారులకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే

Aug 14 2019 4:02 PM | Updated on Aug 14 2019 4:30 PM

Mallanna Sagar Case In TS High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మల్లన్న సాగర్ రైతుల పరిహారం కేసు విచారణ నేడు హైకోర్టులో జరిగింది. మల్లన్న సాగర్‌ ముంపు ప్రాంతాల పరిహారం విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ గతంలో అధికారులకు సింగిల్ బెంచ్ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో శిక్ష పొందిన సిద్దిపేట ఆర్డీవో జై చంద్రారెడ్డి, తోగూట తహసీల్దార్ వీర్ సింగ్, గజ్వేల్ ఇంజనీరింగ్ సూపరింటెండ్‌ వేణు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాలు చేస్తూ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన డివిజన్‌బెంచ్‌.. అధికారులకు విధించిన శిక్షను అమలు చేయరాదంటూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement