నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ | KCR is dealing with dictator | Sakshi
Sakshi News home page

నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్

Aug 12 2015 5:01 AM | Updated on Oct 9 2018 5:22 PM

నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ - Sakshi

నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు...

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నేలకొండపల్లి :
సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం అభివృద్ధికి రూ.వంద కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ మంగళవారం మంద కృష్ణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర కలిగిన బౌద్ధక్షేత్రం కొరకు నేలకొండపల్లి నుం చి సీఎం కేసీఆర్ ఇంటి వరకు ఉద్య మం చేపడతామన్నారు. యాదగిరిగు ట్ట, వేములవాడకు ప్రతి ఏటా రూ. వంద కోట్లు కేటారుుస్తామని ప్రకటించిన సీఎం బౌద్ధక్షేత్రంకు నిధులు ఎందుకు కేటారుుంచరని ప్రశ్నించారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల బౌద్ధక్షేత్రం అభివృద్ధి కుంటుపడిందన్నారు. అన్ని మతాలు, కులాలను సమానం గా చూడాల్సిన ఆయన ఒక మతం, ఒక కులానికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కాగా, దీక్షకు  వైఎస్‌ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు నకిరికంటి సూర్యనారాయణ, ఎంపీటీసీ చిలకల సీతారావమ్మ,షేక్ సత్తార్,మాలమహా నాడు మండల అధ్యక్షుడు చింతమళ్ల మట్టయ్య, కార్యదర్శి దాసరి రామచందర్‌రావు, రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, సీపీఎం మండల నాయకుడు రావెళ్ల సుదర్శన్‌రావు, టీడీపీ నాయకుడు మైశా శం కర్, కడియాల నరేష్, గిరిజన సం ఘం నాయకుడు భూక్యా కృష్ణ, బీసీ సెల్ నాయకుడు జెర్రిపోతుల సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.

దీక్షలో ఎమ్మార్పీఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు వంగూరి ఆనందరావు, జిల్లా అధికార ప్రతినిధి పగిడికత్తుల ఈద య్య, జిల్లా కార్యదర్శి పొట్టపింజర బాలస్వామి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నా యకులు కుక్కల హన్మంతరావు, తోళ్ల బుచ్చాలు, బచ్చలకూరి నాగరాజు, బొడ్డు బొందయ్య, కుక్కల ఆదాం, తోళ్ల వెంకన్న, తోళ్ల గోపి, గ్రామీణ వైద్యుల సంఘం నాయకుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు కూర్చున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement