కాంగ్రెస్, టీడీపీలు దొందు దొందే : కవిత | Kalvakuntla kavitha takes on Congress party and Telugu Desam Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీలు దొందు దొందే : కవిత

Apr 8 2014 12:16 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్, టీడీపీలు దొందు దొందే : కవిత - Sakshi

కాంగ్రెస్, టీడీపీలు దొందు దొందే : కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై మంగళవారం నిజామాబాద్లో నిప్పులు చెరిగారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై మంగళవారం నిజామాబాద్లో నిప్పులు చెరిగారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ఆమె ఆరోపించారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు... తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీలను తెగనమ్మి... రైతులు, కార్మికులు పొట్టకొట్టారని విమర్శించారు.

రానున్న ఎన్నికలల్లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు కాక తప్పదని కవిత జోస్యం చెప్పారు.  2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి ఉంటే ఇంత మంది మరణించేవారు కారని కవిత పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ  బలి తీసుకుందని ఆమె కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోశారు. ప్రజా సంక్షేమంలో కాంగ్రెస్,టీడీపీల రెండు పార్టీల వైఖరి దొందుదొందే నంటూ ఎద్దేవా చేశారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థిగా కవిత పోటీచేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement