
బాబూ.. అబద్ధాలు ఆపు: జూపల్లి
మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన మాట లు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన మాట లు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్‌సాగర్ ప్రాజెక్టులకు పదేళ్లలో రూ.10 కోట్లు ఖర్చుపెట్టిననట్టు చెబుతున్న బాబు.. దీన్ని రుజువు చేస్తే ముక్కును నేలకు రాస్తానని ఆయన సవాలు విసిరారు. పాలమూరు వెనుకబాటుతనాన్ని రూపుమాపానని బాబు అంటున్నారని, మరి పాలమూరు ప్రజలంతా ఎందుకు వలసలు వెళ్లారని ప్రశ్నించారు.