ఒక్క మంచిపనైనా చేశావా?
కేసీఆర్ తన 5 నెలల పాలనలో చేసిన మంచి పని ఏంటో చెప్పాలని ఒక్కటైనా చెప్పాలని కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గండ్ర వెంకటమణరెడ్డి, డిమాండ్ చేశారు.
	హైదరాబాద్: కేసీఆర్ తన 5 నెలల పాలనలో చేసిన మంచి పని ఏంటో చెప్పాలని ఒక్కటైనా చెప్పాలని కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గండ్ర వెంకటమణరెడ్డి, డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందన్న కేసీఆర్... తన పార్టీ ఎంపీలతో పార్లమెంట్ లో సమస్యలు ఎందుకు లేవనెత్తలేదని వారు ప్రశ్నించారు.
	
	ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఏపీలో కలిపినా పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనైనా తెలంగాణ సమస్యలు ప్రస్తావించాలని సూచించారు.
	
	కాంగ్రెస్ ఏనాడు రాజకీయ ఫిరాయింపులు ప్రోత్సహించలేదన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కేసీఆర్ తో విభేదించి  కాంగ్రెస్ లో చేరారని చెప్పారు. ప్రజా సమస్యలు విస్మరించి రాజకీయాలే ఎజెండాగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
