లాంఛనంగా అమెజాన్ క్యాంప‌స్‌ ప్రారంభం

Home Minister Mahamood Ali Inaugurates Largest Amazon Campus In Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంస్థ నెలకొల్పిన అతి పెద్ద క్యాంపస్ భవనాన్నిబుధవారం తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ‌మూద్ అలీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ పాల్గొన్నారు.  

ఈ-కామర్స్ రంగంలో అతిపెద్ద సంస్థ అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలోని నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసింది. కార్యాలయాన్ని ప్రారంభించి  హోంమంత్రి మాట్లాడుతూ.. గ‌చ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌ తెలంగాణ‌లోనే అతిపెద్ద బిల్డింగ్ కావడం విశేషమని, ఇది మనకు గర్వకారణమని అన్నారు.  

అమెజాన్ ఇండియా మేనేజ‌ర్‌ అమిత్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ.. 9.5 ఎకరాల్లో విస్తరించిన అమెజాన్ క్యాంప‌స్‌లో సుమారు 15వేల మంది ప‌నిచేయ‌నున్నారని వివ‌రించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top