'చెట్టు పడింది..కనపడటం లేదా'

Harish Rao Has Planted Tree Near Siddipet Busstand - Sakshi

ఎమ్మెల్యే హరీశ్‌ రావు

సాక్షి,సిద్దిపేట : 'మనం నాటిన మొక్కను నిర్లక్ష్యం చేస్తే..ఆ మొక్క కూడా మనలాగే నిర్లక్ష్యం చెయాలన్న ఆలోచన వస్తే మన మనుగడ ఏమవుతుందో ఆలోచించుకోవాలని'  మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ఎప్పుడు చెపుతుంటారు. కాగా, శనివారం దానిని ప్రత్యక్షంగా చేసి చూపించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద కరీంనగర్ వెళ్లే దారిలో ఒక షాప్ ముందు చెట్టు కింద పడి ఉండడం హరీశ్‌రావు గమనించారు. వెంటనే కారు దిగి నేరుగా షాప్ యజమాని దగ్గరికి వెళ్లి, ఏం బాబు ! చెట్టు కింద పడింది కనపడటం లేదా అని షాప్‌ యజమానిని ప్రశ్నించారు. రోజు చూసే చెట్టే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పి, కింద పడిన చెట్టును కర్రతో కట్టించి సరి చేయించారు. మొక్కలు నాటడమే కాదు..వాటిని సంరక్షించడం మన భాధ్యత అని పేర్కొన్నారు. మన ప్రాణం ఎంతో.. మొక్క ప్రాణం అంతే అని మరో సారి మొక్కను నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి వెళ్లిపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top