మన్ననూర్‌ ‘మచ్చ’లకు బ్రాండింగ్‌! | Sakshi
Sakshi News home page

మన్ననూర్‌ ‘మచ్చ’లకు బ్రాండింగ్‌!

Published Tue, Sep 19 2017 1:49 PM

మన్ననూర్‌ ‘మచ్చ’లకు బ్రాండింగ్‌!

ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం

తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు కోనేరు స్వచ్ఛంద సంస్థ, వాస్స న్‌ సంస్థల సహకారం తో ఈ జాతిని అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు పెద్ద ఎత్తున పరిశోధ నలు జరుగుతున్నాయి.

నాగర్‌కర్నూల్‌ నుంచి బక్షి శ్రీధర్‌రావు :
ఒంగోలు గిత్తకు ఏమాత్రం తక్కువ కాకుండా పలు జన్యు ప్రత్యేకతలు కలిగి ఉండి నల్లమల అటవీ ప్రాంతానికే పరిమిత మైన అతి అరుదైన మన్ననూర్‌ మచ్చల పశువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, మన్ననూర్, బి.లక్ష్మా పూర్‌ ప్రాంతాల్లోని మచ్చల పశువులను సంరక్షించేందుకు ప్రత్యే కంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది బి.లక్ష్మాపూర్‌లో మొదటి పశువుల ప్రదర్శన నిర్వహించింది.

మన్ననూరు మచ్చల పశువుల అభి వృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఆర్గనై జింగ్‌ కమిటీని నియమించింది. ఇందులో భాగంగా పశువుల పెంపకందారులతో ఓ అసోసియేషన్‌ను ప్రారంభించారు.

ఈ పశువులను సంరక్షిస్తున్న రైతాంగానికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నారు. మచ్చల కోడెల వీర్యాన్ని సేకరించి వాటి సంతతిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన్ననూర్‌ పొడలను రాష్ట్ర పశువుగా గుర్తించింది. తెలంగాణ జీవ వైవిధ్య విభాగం ప్రతినిధు లు ఈ పశువులోని ప్రత్యేకతలు మరే ఇతర పశువుల్లోనూ లేవని తేల్చి చెప్పారు.

ఎంతటి కరువునైనా తట్టుకుంటాయని, వర్షం రాకను ముందే పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరుకునే తెలివైన పశువులని నాగర్‌కర్నూల్‌ జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి అంజిలప్ప చెప్పారు.

వ్యవసాయం, పాడికి ఉపయోగం..
సహజసిద్ధంగా అడవుల్లోని కొండల్లో నివ సించే మచ్చల పశువులు పలు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. వీటిని మన్ననూర్, అమ్రా బాద్, బి.లక్ష్మాపూర్, అచ్చంపేట, లింగాల ప్రాంతాల్లోని రైతులు మచ్చిక చేసుకుని వ్యవసాయ, పాడి అవసరాలకు ఉపయోగిస్తు న్నారు. చెంచులు, గిరిజన రైతులు వీటిని తూర్పు పొడలు, మచ్చల పసురాలు అంటా రు. వీటి కాలి పిక్కలు, గిట్టలు దృఢంగా ఉండటం వల్ల ఎంత ధరైనా చెల్లించి రైతులు కొంటారు. మచ్చల ఆవులు రోజూ మూడు నుంచి ఐదు లీటర్ల పాలిస్తాయి. వీటికి తగిన పౌష్టికాహారం అందించి వృద్ధి చేస్తే మెరుగైన ఫలితాలిస్తాయని కోనేరు, వాస్సన్‌ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.  

                                   నల్లమల గిరుల్లో సంచరించే పొడ జాతి పశువులు

Advertisement
 
Advertisement
 
Advertisement