పుష్కరాలకు వేళాయే.. | godavari pushkaralu in telangana | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వేళాయే..

Jul 13 2015 6:34 PM | Updated on Sep 3 2017 5:26 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గోదావరి పుష్కర ఘడియలు రానే వచ్చాయి.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గోదావరి పుష్కర ఘడియలు రానే వచ్చాయి. తిరుమల తిరుపతి ఆస్థాన సిద్ధాంతుల గణన ప్రకారం మరి కొద్ది గంటల్లో (మంగళవారం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు) గురువు సింహరాశిలోకి ప్రవేశించ డంతో పుష్కర సంరంభం మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటారుుంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 106 పుష్కరఘాట్లు ఏర్పాటు చేయగా ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 39 ఘాట్లు నిర్మించింది. ధర్మపురి, కాళేశ్వరం, మంథని, కోటిలింగాల సహా జిల్లాలోని ఘాట్లకు రోజుకు 50 లక్షలకుపైగా భక్తులు వస్తారని అంచనా. గోదావరమ్మ ఇప్పటికీ ఘాట్లకు చేరుకోకపోగా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరస్నానమాచరించి సంరంభాన్ని ప్రారంభించేందుకు సోమవారం సాయంత్రమే ధర్మపురి చేరుకోనున్నారు.
 
 పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. ఘాట్ల నిర్మాణం, దేవాలయాల ఆధునీకరణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం, మంథని, ధర్మపురి, గోదావరిఖని పుష్కర ఘాట్ల వద్ద వివిధ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గతంతో పోలిస్తే పుష్కర ఏర్పాట్లు బాగాానే చేస్తున్నప్పటికీ గతంకంటే ఏడెమినిది రెట్లు అధికంగా భక్తులు వచ్చే అవకాశముండటంతో... ఆ స్థాయికి తగినట్లు ఏర్పాట్లు చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
 
 పోలీసుల దిగ్బంధంలో ధర్మపురి, కాళేశ్వరం
 
 పుష్కరాల భద్రత కోసం జిల్లావ్యాప్తంగా దాదాపు 6 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ధర్మపురి, కాళేశ్వరంలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డామినేషన్ పార్టీలు, డాగ్‌స్క్వాడ్, డిస్పోజల్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విసృ్తతంగా తనిఖీలు చేపట్టారు. ఈ రెండు ప్రాంతాలకు పెద్ద ఎత్తున మంత్రులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 5 వేల మంది వలంటీర్లు సేవలందించనున్నారు. ధర్మపురి, కాళేశ్వరంతోపాటు కోటిలింగాల పుష్కర ఘాట్ల వద్ద ఎన్టీపీసీ సహకారంతో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలను అమర్చారు. 540 మంది గజ ఈతగాళ్లను, 6 రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు. 213 మంది ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పుష్కర ఘడియలు సమీపిస్తుండడం... పనులు పూర్తికాకపోవడం జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆందోళన పరుస్తోంది. కలెక్టర్ సహా అధికార యంత్రాంగమంతా రోజువారీ కార్యక్రమాలను పూర్తిగా పక్కనపెట్టి పుష్కర ఏర్పాట్లపైనే నిమగ్నమయ్యారు. ఒక్కో ఘాట్‌కు ఒక్కో తహశీల్దార్ నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి యుద్దప్రాతిపదికన పనులు పూర్తిచేరుుస్తున్నారు. మొత్తంగా 7 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఏర్పాట్లలో మునిగిపోయూరు.
 
 వసతి కష్టమే
 
 ధర్మపురి, కాళేశ్వరం ఘాట్లకు లక్షలాది మంది తరలివచ్చే అవకాశముండగా వారికి సరిపడా వసతి లేకపోవడం ఇబ్బందికరమే. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయా లు, గెస్ట్‌హౌస్‌లు, విశ్రాంతి భవనాలు, సత్రాలన్నింటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. వీఐపీలు, పోలీ సులు, అధికాారులకే ఈ వసతి భవనాలు సరిపోయాయి. భక్తులకు ఇవి దొరకడం గగనమే. ప్రైవేటు గదులు సైతం ఇప్పటికే బుక్ అయ్యూరుు. దర్శనం కోసం ఈ రెండు ఆల యూల్లో గంటల తరబడి వేచి ఉండక తప్పని పరిస్థితి. వీటితోపాటు పారిశుధ్య సమస్య వెంటాడుతోంది. 5 వేల మంది కార్మికులతో పనులు చేయిస్తున్నామని చెబుతున్నా... ఎటు చూసినా చెత్తకుప్పలు, మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి.
 
 24 గంటల మెడికల్ క్యాంపులు
 
 పుష్కర ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 44 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 26 శిబిరాల్లో 24 గంటలపాటు వైద్య సేవలందించనున్నారు. 200 మంది డాక్టర్లను, 500 మంది పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచారు. ధర్మపురి, కాళేశ్వరం ప్రధాన ఘాట్ల వద్ద అత్యవసర సేవల కోసం 10 పడకలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని, 6 అంబులెన్సులను సిద్ధం చేశారు. వీటితోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు.
 
 ధర్మపురికి 250... కాళేశ్వరానికి 110 బస్సులు
 
 పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రతిరోజు ఏకంగా 635 బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ధర్మపురి 250, కాళేశ్వరానికి 110, కోటిలింగాలకు 25 బస్సులు నడపనుంది. హైదరాబాద్, కరీంనగర్‌తోపాటు జిల్లాలోని ప్రతి బస్ డిపో నుంచి భక్తుల డిమాండ్ మేరకు నిరంతరం ఆయా ప్రాంతాలకు బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయనున్నారు. కరీంనగ ర్ నుంచి కాళేశ్వరానికి 140 కి.మీలుండగా... ప్రస్తుతం రూ.94 వసూలు చేస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో రూ.141 వసూలు చేయనున్నారు. కరీంనగర్ నుంచి ధర్మపురికి రూ.56 ఉండగా, పుష్కరాల సమయంలో రూ.85 వసూలు చేయనున్నారు.
 
 1672 మంది పురోహితులు
 
 పుష్కరాలకు 1672 మంది పురోహితులను నియమించి గుర్తింపు కార్డులు జారీ చేశారు. వీరంతా గుర్తించిన ఘాట్ల వద్ద సేవలందించాలి. ఏరోజు ఏ పూజకు ఎంత చార్జీ వసూలు చేయాలనే వివరాలను ఘాట్ల వద్ద ప్రదర్శించనున్నారు. అధిక డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక పూజ సామగ్రి, తినుబండారాలు, నిత్యావసర వస్తువల ధరల అదుపు అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ధర్మపురి, కాళేశ్వరం ప్రాంతాల్లో అడ్డగోలు ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారు.
 ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల
 
 పుష్కరాల ఘడియ ముంచుకొస్తున్నప్పటికీ ధర్మపురిలో ఇప్పటి వరకు నీళ్లులేని పరిస్థితి. కడెం ప్రాజెక్టు నుంచి 2 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, ఈ నీరు కమ్మునూర్ వంతెన దాటి ప్రవహిస్తోంది. సోమవారం మధ్యాహ్నానికల్లా నీరు ధర్మపురి చేరుకోనుంది. ఎల్లంపల్లి నుంచి 500 క్యూసెక్కులు విడుదల చేయడంతో గోదావరిఖని, మంథని ఘాట్లలో పుష్కరస్నానాలకు ఇబ్బందులు తప్పనున్నారుు. కాళేశ్వరం, కోటిలింగాల ప్రాంతాల్లో నీరు పుష్కలంగా ఉండడంతో ఈ ప్రాంతాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముంది. మిగతా చోట్ల ఘాట్ల వరకు నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో షవర్ల స్నానమే దిక్కవనుంది.
 
 నేడు సీఎం రాక
 
 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుష్కరాల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం 4 గంటలకు ధర్మపురికి రానున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ధర్మపురికి చేరుకుంటారు. ధర్మపురి సమగ్రాభివృద్ధిపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. రాత్రి ‘హరిత ప్లాజా’ హోటల్‌లో బస చేస్తారు. ఉదయం ధర్మపురిలో పుష్కర స్నానమాచరించి లక్ష్మీనర్సింహస్వామి దర్శనం చేసుకుంటారు. సీఎం రాక నేపథ్యంలో ధర్మపురిలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 పీఠాధిపతుల రాక
 
 పుష్కరాలకు ధర్మపురికి ఏడుగురు పీఠాధిపతులు వంద మందికి పైగా శిష్యబృందాలు తరలిరానున్నారుు. శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధిపతితోపాటు 60 మంది శిష్యబృందం, రాఘవేంద్ర స్వామీజీ పీఠాధిపతితోపాటు 10 మంది శిష్యబృందం, వీరశైవ పీఠాధిపతితోపాటు 5 గురు శిష్యబృందం, ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద స్వామి సరస్వతి పీఠాధిపతితోపాటు శిష్యబృందం, మదనానంద స్వామీజీ, తోగూట పీఠాధిపతితోపాటు శిష్యబృందం, విశాఖపట్నంకు చెందిన స్వరూపానంద స్వామీజీ, శారదాపీఠం స్వామీతోపాటు వారి శిష్యబృందం రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement