రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న వస్తువులు పక్కదారి పడుతున్నాయని, అలాంటి కేంద్రాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న వస్తువులు పక్కదారి పడుతున్నాయని, అలాంటి కేంద్రాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, పథకాల అమలు, పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉప కార్యదర్శి ప్రశాంతి, డెరైక్టర్ విజేంద్ర, జిల్లాల పీడీలు పాల్గొన్నారు.