నల్లగొండ జిల్లా రాజాపేట్ మండలం రేణిగుంట గ్రామంలో విద్యుదాఘాతంతో ఆదివారం కొన్యాల అంజిరెడ్డి అనే రైతు మృతి చెందాడు.
నల్లగొండ జిల్లా రాజాపేట్ మండలం రేణిగుంట గ్రామంలో విద్యుదాఘాతంతో ఆదివారం ఓ రైతు మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన కొన్యాల అంజిరెడ్డి (60) అనే వ్యక్తికి మోటర్‌కు ఉన్న సర్వీసు వైరు కిందకు వాలిపోయి కనిపించింది. దాన్ని కర్రతో పైకి తీసేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో సర్వీసు వైరు.. ఎల్టీ లైనుకు తాకడంతో.. అంజిరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.