మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కుంకుడుచెట్టు తండాకు చెందిన ఓ రైతు మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. రమావత్ రమేష్(28)ఐదు ఎకరాల పొలంలో సాగు కోసం రూ.3 లక్షల అప్పులు చేశాడు. అయితే, కళ్ల ఎదుటే పంటలు ఎండిపోతుండడంతో కలత చెందిన అతడు ఈనెల 16న పొలంలోనే పురుగుల మందు తాగాడు. అతన్ని నార్కట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు.